డ్రగ్స్ కేసు తర్వాత టాలీవుడ్ ఈ మధ్యే కాస్త ప్రశాంతంగా ఉంది, కాని మహేష్ కత్తి పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ తో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నిన్న మొన్నటి వరకు కేవలం పవన్ ను వ్యక్తిగతంగా మాత్రమే విమర్సిస్తున్నాడు అనుకున్నారు. కానీ నిన్న ప్రెస్ క్లబ్ లో మహేష్ కత్తి పూనం కౌర్ పై సంధించిన ప్రశ్నలు చూస్తుంటే ఏదో జరుగుతుంది అన్న అనుమానం రాకపోదు.

పూనం కౌర్ కు ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఇప్పించారు ? తిరుపతి లో పవన్ పూనం ఎందుకు ఒకే గోత్రం తో పూజలు చేయించారు ? ఇలా సాగింది ఆయన ప్రశ్నల పరంపర. అయితే ఇందులో ఒకే గోత్రం పై పూజలు చేయడం అనేదానికి కాస్త సంధానం దొరికింది. పంజాబీ లకు గోత్రం ఉండదు కాబట్టి పవన్ గోత్ర నామం తో పూజ చేయించారు అని చెప్పొచు. అలా చెప్పిన కూడా ఇక్కడ ఇంకొక సందేహం రాకమానదు.

పూనం కౌర్ పవన్ తో కలిసి నటించింది లేదు..కానీ ఇద్దరు కలిసి తిరుపతికి ఎందుకు వెళ్ళినట్లు మహేష్ కత్తి చెప్పవరకు అసలు పవన్ పూనం కౌర్ ఒకరికి ఒకరు తెలుసు అన్న విషయం కూడా తెలియదు ఎవరికీ. అలాంటిది నిన్న అడిగిన ప్రశ్నల్లో పూనం కౌర్ ఆత్మహత్యా యత్నం చేస్తే ఎవరు బిల్ కట్టారు, తరువాత పవన్ పూనం కౌర్ తల్లికి ఏమని ప్రమాణం చేసాడు అన్నది తెలియాల్సి ఉంది. మహేష్ కత్తి తన వద్ద ఆధారాలు ఉన్నాయి అంటున్నాడు తప్ప ఇంతవరకు దేన్నీ భయట పెట్టలేదు కాబట్టి అతను మాట్లాడిన దానిలో నిజం ఉందొ లేదో కూడా నమ్మడానికి లేదు. చూద్దాం పవన్ దీనిపై ఎలా స్పందిస్తారో లేక ఎప్పటి లాగానే లైట్ తీసుకుంటారో…!

Facebook Comments
News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recommended
Recommended