హైదరాబాద్: ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ ఇటీవల వరుస విమర్శలతో జనసేనా పార్టీ అధ్యక్షుడు, నటుడు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఆదివారం మహేష్ ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ లైవ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను పవన్ ఫ్యాన్స్ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. తన తల్లి, భార్యను బయటకు చెప్పలేని పదాలతో దూషిస్తున్నారని చెప్పుకొచ్చారు. అంతేగాక తనపై విమర్శలు చేస్తున్న హీరోయిన్ పూనమ్ కౌర్‌కు ఆరు సూటి ప్రశ్నలు సంధించారు కత్తి.

1. మీకు ఎపి చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎవరి వల్ల వచ్చింది?
2. తిరుమలలో పవన్ పక్కనే నిల్చొని ఓకే గోత్రనామాలతో ఎందుకు పూజ చేయించుకున్నారు?
3. మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు? మీరున్న ఆస్పత్రి ఏంటి? మిమ్మల్ని కాపాడింది ఎవరు? ఆస్పత్రి బిల్లులు కట్టింది ఎవరు?
4. పవన్ మీ అమ్మగారిని కలిసి ఏమని ప్రామిస్ చేశారు? ఇప్పటి వరకు అవి నెరవేర్చారా? లేదా?
5. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే మీకు ఎందుకు కోపం?
6. క్షుద్ర మాంత్రికుడు నర్సింగం చేసిన పూజలో మీరు ఏం చేశారో చెప్పగలరా? అంటూ పూనమ్ ను సూటిగా ప్రశ్నించారు కత్తి మహేష్. వీటికి ఆమె సమాధానం చెబితే బాగుంటుందన్నారు. అంతేగాక వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. పూనమ్ సమాధానం చెబితే తన వద్ద ఉన్న ఆధారాలు చూపుతానని చెప్పుకొచ్చారు.

Facebook Comments
News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recommended
Recommended
మంగళవారం ఉదయం బెంగళూరులోని బార్-కమ్-రెస్టారెంట్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది అయిదుగురు మరణించారు . మరణించిన…