పూనమ్ కౌర్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య ఏదైనా సంబంధం ఉందో లేదో తెలియదు కానీ కత్తి మహేష్ పూనమ్ కి సంధించిన ఆరు ప్రశ్నలకు మాత్రం మీడియా, ఫాన్స్ అవన్నీ వదంతులే అని నిరూపించడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం చాలా ఉన్నాయి. అయితే కత్తి మహేష్ లైవ్ షో లో ఉన్నపుడు కిరణ్ రాయల్ అనే జన సేన పార్టీ కార్యదర్శి ఫోన్ కాల్ లో ‘అసలు తిరుమల లో ప్రత్యేక అర్చనలు ఎక్కడ ఉండవు అని, ఇంతవరకు ఎవరికీ కూడా చేయలేదు’ అని బలంగా చెప్పారు . కత్తి మహేష్ మాత్రం తన దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయి అని, ఒకవేళ అవసరం అయితే బయట పెడతాను అని సమాధానమిచ్చారు.

 

అసలు పూనమ్ కౌర్ ని ఇన్ని రోజులు మర్చిపోయిన జనాలు ఇపుడు ఒక వదంతు రాగానే తన మీద ఇంకా ఏదైనా టాపిక్ దొరుకుతుందేమో అని గూగుల్ లో వెతుకుతున్నవారు కోకొల్లలు. తాజాగా ఇంకో వార్త ఏమిటంటే పూనమ్ యదపైన ‘PK ‘ అని ఒక టాటూ కన్పిస్తున్న ఫోటో ఒకటి బయటికి తీసి, PK అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పుకుంటున్నారు, ఐతే ఇదే విషయం పూనమ్ ని ‘PK ‘ అంటే పూనమ్ కౌర్ లేదా పవన్ కళ్యాణా అని అడిగితే మీరు ఏది అనుకుంటే అదే సమాధానమిచ్చిందట! తాను ఆలా అనడం నెటిజెన్ల వదంతులకు బలం చేకూరుతుంది అని కొందరు సీనియర్ యాక్టర్స్ చెప్పుకొచ్చారు! చివరకు మాత్రం పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ పైన చేసిన ట్వీట్లకు ఏదో ఒక సమాధానం వస్తుందని ఆశిస్తున్నారు జనాలు !

Facebook Comments
News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recommended
Recommended