ప్రపంచంలో లక్షలాది మంది  అభిమానులను తన ఆట తీరుతో కోహ్లీ సంపాదించుకున్నాడు, కోహ్లీ యొక్క విజయాన్ని అభిమానులు  సంతోషంగా జరుపుకుంటారు మరియు భారత కెప్టెన్ బాగా ఆడలేకపోతే  నిరాశ చెందుతారు.కానీ ఒక అభిమాని మాత్రం తను బాగ ఆడలేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాలుపడ్డాడు.

మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాకు చెందిన బాబబల్ భైర్వా ఈ అగత్యానికి పాలుపడ్డాడు వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యులు, పొరుగువారు అతని ఏడుపులు విని తన గదిలోకి వెళ్లి చుస్తే ఆత్మహత్యకు పాలుపడ్డాడు అని తెలిసింది . తన తల, చేతులు మరియు ముఖంపై చాలా గాయాలు అయ్యాయి. అయితే, అతని పరిస్థితి ఇప్పుడు స్థిరంగా ఉందని డాక్టర్లు చెప్పారు. “విరాట్ కోహ్లిని తొలగించినందుకు తాను నిరాశకు గురైనట్లు తను రాసిన లెటర్లో వివరించారు ,” అని పోలీసు స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పి.ఎస్.అలావా చెప్పారు .

అతను ఆత్మహత్యకు ప్రయత్నించినప్పుడు బైర్వా తాగాడు  అని వైద్య నివేదికలో తెలిసింది. ఇలా జరగడం  మొదటిసారి కాదు. 2017 ఫైనల్లో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్తో భారత్ ఓడిపోయిన తరువాత, బంగ్లాదేశ్లోని ఒక భారతీయ క్రికెట్ జట్టు అభిమాని – ఆత్మహత్య కు పాలు పడ్డాడు.

Facebook Comments
News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recommended
Recommended