నాలుగో రోజు అట మొదలయినప్పటి నుండి మన బౌలర్లు సౌతాఫ్రికా మీద విరుచుకపడ్డారు. తోలి సెషన్ లోనే ఐదు వికెట్స్ తీసి సౌత్ ఆఫ్రికాను కోలుకోకుండా చేసారు. హషీం ఆమ్లా, కగిసో రబడ, ఫాఫ్ డు ప్లెసిస్, క్విన్టన్ డి కాక్, వెర్నాన్ ఫిలాండర్ – దక్షిణాఫ్రికా కొద్దీ వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోయారు. మొహమ్మద్ షామి, జాస్ప్రీత్ బుమ్రాలు సౌత్ ఆఫ్రికాను దెబ్బతీశారు . ప్రస్తతం AB డివిలియర్స్ మరియు కేశవ్ మహారాజ్ క్రీజ్ లో ఉన్నారు.33.4 ఓవర్ల దక్షిణాఫ్రికా 95-7తో ఉన్నది.

మొదటి సెషన్ నుంచి భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. కట్టు దిట్టమైన బౌలింగ్ చేస్తూ సౌతాఫ్రికాను ఏ దశలోనూ కూడా కోలుకోకుండా చేసారు. క్విన్టన్ డి కాక్ రన్ అవుట్ ఛాన్సును ధావన్ వదిలేసాడు. కానీ ఆ ఛాన్సును క్విన్టన్ డి కాక్ ఎక్కువ సేపు చేజిక్కిచ్చుకోలేకపొయ్యాడు,మరుసటి ఓవర్ లోనే బుమ్రా కి చిక్కాడు. దీనితో ధావన్ ఊపిరి పీల్చుకున్నాడు.

నైట్‌వాచ్‌మన్‌ రబాడ (5), హషిమ్‌ ఆమ్లా (4)ను షమి పెవిలియన్‌ పంపించాడు. జట్టు స్కోరు 66 వద్ద ఆమ్లాను, 73 వద్ద రబాడను ఔట్‌ చేశారు.ఇక 28.4 వ బంతికి 82 పరుగుల వద్ద సారథి డుప్లెసిస్‌ (0)నుడకౌట్‌ చేసిన బుమ్రా మరో 10 పరుగులకే కీపర్‌ డికాక్‌ (8; 9 బంతుల్లో 2×4)ను అద్భుత బంతికి పెవిలియన్‌కు పంపించాడు. ఆఫ్‌సైడ్‌ వెళ్తున్న బంతి డికాక్‌ బ్యాట్‌ వెలుపలి అంచుకు తగిలి కీపర్‌ సాహా చేతిలో పడింది. అంపైర్‌ ఔట్‌ ఇవ్వకపోవడంతో భారత్‌ సమీక్ష కోరింది. దీంతో అతడు వెనుతిరగక తప్పలేదు.ప్రస్తుతం AB డివిలియర్స్ మరియు కేశవ్ మహారాజ్ క్రీజ్ లో ఉన్నారు

Facebook Comments
News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recommended
Recommended
పూనమ్ కౌర్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య ఏదైనా సంబంధం ఉందో లేదో…